Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
అమ్మా ఆరోగ్యమాతా - మమ్ముల బ్రోవవమ్మా
నీ ప్రియ బిడ్డలము మాకై వేడుమమ్మా
1. కలవరపరచే వ్యాధులతో-సతమతమయ్యే శోధనతో
ఆశగ నీదరి చేరుకొని-సేదను పొందగ వేచితిమి
శరణం శరణం మా అమ్మా-మమ్ముల కావగ రావమ్మా
2. వేదన నిండిన హృదయముతో-నీ దరి చేరిన దీనులకై
నీ ప్రియ సుతుని ప్రార్థించి-ఊరటనొసగి పంపుమమ్మా
శరణం శరణం మా అమ్మా-మమ్ముల కావగ రావమ్మా