Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
అమ్మా ఓ మరియమ్మ మా మొర ఆలకించమ్మా
1. పిత సర్వేశ్వరుని పుత్రీ పావనాత్మ పత్నీ
సుత సర్వేశ్వరుని మాతా - నుతియింతు మతిని
2. త్రిత్వైక దైవ ప్రేమకు పాత్రురాలవై
వనితా లోకానికే నీవు వన్నెకదవమ్మా ||అమ్మా ||
3. పవిత్రతకు, పావనతకు మాతృకీవమ్మా
కన్యశుద్ధము చెరపనొల్లని కన్యకవు నీవమ్మా ||అమ్మా ||
4. కన్యలకు కన్యకామణి తల్లులకు ఓ తల్లివి
బిడ్డలనుగా మమ్ముజూచి ఆదుకొనుమా ఆపదలలో ||అమ్మా ||
5. ప్రభుని వాగ్దానములు ఎపుడు వమ్ము కావని నమ్మిన
పుణ్యశీలి నిష్కళంక నిండు విశ్వాసి ||అమ్మా ||
6. దైవసుతునికి తల్లివైన ధన్యనీవమ్మా
దైవ వరముల వాహినిగా వాసికెక్కితివి ||అమ్మా ||
7. ఆపదలలో అవసరాలలో అనారోగ్యములో
ఆదరవువై అండదండై అవని బ్రోచుదువే ||అమ్మా ||
8. ప్రార్థించు వారికెపుడు ప్రక్క నిలుచుండి
అడిగినట్లైల్ల ఇచ్చి కాచు అనుగ్రహపూర్ణా ||అమ్మా ||
9. విధేయతకు వినమ్రతకు విజ్ఞతవు నీవు
సాటిలేని మేటివమ్మా - కోటి దండాలు ||అమ్మా ||
10. పూలమాలల చేతకాక జపమాలలతో
భజియించు భక్తకోటికి ముక్తి నీవమ్మా ||అమ్మా ||
11. మీరు సాయము కోరు పేదల నెపుడు కాదనక
ఆదుకొనుమా అమ్మలాగ - కమ్మనితల్లి ||అమ్మా ||
12. ప్రభుని మరణ దిగ్విజయ - ప్రభావమున మీరు
మోక్షమునకు ఎత్తబడిరే - అక్షయమాతా ||అమ్మా ||
13. పరలోక భూలోక పట్టమహిషివే
పరమున మము చేర్చుమా పావనమాత ||అమ్మా ||
14. పాపులకు ముక్తిచూపు మోక్ష ద్వారమా
దివ్య యేసుని మోసినట్టి దైవ మందసమా ||అమ్మా ||
15. ధర్మమునకు దర్పణమై ధరణి వెలుగొందు
దయా దాక్షిణ్యముల పాత్రవే నయనానంద ||అమ్మా ||
16. పరిశుద్ద పాపుగారికి - మేత్రానులకు
గురువులకు ఆరోగ్యమిచ్చి సంఘమును కాయు ||అమ్మా ||
17. సువార్తీకుల బోధకులకు - బొక్కసము నీవై
అడుగు, అడుగున తోడు నిలచి నిడుము ధైర్యమును ||అమ్మా ||
18. జ్ఞానమునకు ఆలయం సంతోషకారణం
సన్మనస్కుల రాజ్జివమ్మా మంచిమనసిమ్మా ||అమ్మా ||
19. కన్యకలకు కన్యవైన పుణ్యురాలవే
కన్యస్త్రీల వ్రతము కావవ - కన్యకల రాజ్జి ||అమ్మా ||
20. మానవతతో సేవచేసి - మాధవుని చేర
స్వస్థతా వరమిచ్చివు - వైద్యులందరికి ||అమ్మా ||
21. కాయకష్టం చేయుచున్న కార్మికులను
భద్రతిచ్చి కావుమమ్మా కరుణగలమాతా ||అమ్మా ||
22. తల్లి దండ్రుల పిన్న పెద్దల ఉపాధ్యాయులను
కాపాడుము కన్యమరియా - కలకాలము ||అమ్మా ||
23. సకల స్తుతుల సంసేవిత సద్గుణ భరిత
నిర్మలాత్మ భాగ్యశాలి మహిమగల కన్యా ||అమ్మా ||
24. చదువు సంధ్యల ఆటపాటల చిన్నారులందరికి
బంగారు భవితనిచ్చి కాపాడుమమ్మా ||అమ్మా ||
25. దేశ విదేశములయందున వసియించు వారిని
అన్ని స్థలముల అన్నివేళల ఆదుకొనుమమ్మా ||అమ్మా ||
26. పరమ రహస్యముల నిధివే పాపులకు ఓ పెన్నిధి
జ్ఞాన పాత్ర విమల చరిత పూజ్య ప్రపూత ||అమ్మా ||
27. విశ్వమంతట వ్యాపించి వేనోళ్ళతో
కొనియాడు విశ్వాసుల కాచికాపాడు ||అమ్మా ||
28. దేవుని ఘన కార్యముల దయకు పాత్రవై
తరతరముల ధన్యురాలని పిలువబడుదువే ||అమ్మా ||
29. దావీదు వంశ వృక్ష ఫలముగా వెలసి
స్వర్ణ మయమై ఆలయముగా అలరితివమ్మా ||అమ్మా ||
30. చెమటోడ్చి భూమిదున్ను రైతులందరికి
మంచి ఫలములనిచ్చి కాయు మా మంచిమాత ||అమ్మా ||
31. దూర భార ప్రయాణములు చేయు వారిని
క్షేమకరముగ చేర్చుమమ్మా యాత్రికులమాతా ||అమ్మా ||
32. వినీలాకాశమున వెలిగే ఉషోదయ తార
క్షతగాత్రుల చేరదీయవా క్రైస్తవుల మాతా ||అమ్మా ||
33. జన్మపాప రహితోద్భవి జనరంజని
జగజ్జనకుని జననివైన జగదాంబవే ||అమ్మా ||
34. సమత మమత మానవత సన్మాతృకీవమ్మా
శాంతి సమాధాన రాజ్ఞ - సంస్తుతింతును ||అమ్మా ||
35. పాప విమోచకుని పుడమికిచ్చి
పాప ప్రక్షాళివైతివి పాపాశమనీ ||అమ్మా ||
36. పితా పిత్రుల అపోస్తుల వేదసాక్షులకు
ప్రవక్తలకు రాజ్ఞవమ్మా పునీతుల మాతా ||అమ్మా ||