Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
1. అమ్మా నిను వేడెదము మరియమ్మా నిను వేడెదము
అమ్మా నినువేడ నెమ్మది రమ్మని -
కమ్మని వరములు సమ్మతించు వనుచు
2. కన్య నిను వేడెదము నిత్య కన్య నిను వేడెదము
కన్యా నిను వేడ పుణ్యములొనగూర్చి -
యన్యములెరుగని ధన్యుల మముచేయు
3. తల్లీ నిను వేడెదము కల్పవల్లీ నిను వేడెదము
తల్లి నినుపేడ చల్లని యుల్ల
మెల్లను మామీద కొల్లగ జల్లవా
4. రాజ్జీ నిను వేడెదము మోక్ష - రాజ్జీ నిను వేడెదము
రాజ్జీ నిను వేడ రంజిల్ల జేసియు -
అజ్ఞానము బాపి సుజ్ఞానమియ్యవా
5. మరియా నిను వేడెదము కన్య మరియా నిను వేడెదము
మారియా నిను వేడ కరుణించి మామరణ
తరుణమున ఆదరణ శరణంబిత్తువనుచు ||అమ్మా||