Type Here to Get Search Results !

అమ్మా పరలోక పావని ( amma paraloka pavani Song Lyrics in Telugu | Telugu Christian song lyrics website )

 Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. అమ్మా పరలోక పావని ||2|| 

మనుజాళికి శుభమొసగు

వరదాయిని నీవమ్మా 


1. నిజ దేవుడు ఉదయించే సుతుడుగా

నిన్ను దీవించే లోకానికి మాతగా 

మమతానురాగాల తల్లిగా 

మము కాపాడే నిత్య కల్పవల్లిగా

వ్యాకుల మాతవూ- వేదన బాపుమా 

పరలోక రాణివి-పరమున జేర్చుమా 

బ్రతుకునావ చుక్కానివి నీవే కావుమా 

సుతుని కడకు నీవే మమ్ము

నడిపించుమా...నడిపించుమా... ||అమ్మా|| 


2. ఉదయాలను వెలిగించే తారవూ

హృదయాలను రవళించే ప్రేమవూ 

అనురాగ కుసుమాల తావిగా 

భువిలో నీ దివ్య శాంతి జల్లుగా 

అమ్మలకమ్మవూ ఆదరముంచుమా

మోక్షపు వాకిలి ముక్తిని ఒసగుమా 

బ్రతుకునావ చుక్కానివి నీవే కావుమా 

సుతుని కడకు నీవే మమ్ము 

నడిపించుమా...నడిపించుమా.... ||అమ్మా|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section