Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
అమ్మా మరియ మోక్షరాజ్ఞి
యేసుని మాతా ఓపుణ్యచరిత
మా ప్రియతల్లి ఆప్తులవల్లి
మాకల్పవల్లి ఓ కన్యమేరి
దీనులకావమ్మానీ దీవెనలీవమ్మా
మా కొరకు నీసుతుని ప్రార్ధించమ్మ
1 వ చరణం.. ఆదిదేవుని తలపులందు నిలిచినావమ్మా
ఆత్మదేవుని ఆలయముగా అలరినావమ్మా
దేవసుతునికి మాతఅయిన ధన్య నీవమ్మా
సకల జగతికి తల్లి అయి ఇల వెలసినావమ్మా||దీనుల||
2 వ చరణం.. అవనిలోని స్త్రీలకెల్లా మిన్ననీవమ్మా
ఇహపరములకు మధ్యవర్తిగానిలిచినావమ్మా
పరమపావని మోక్షరాజ్ఞి నీవే మాయమ్మ
దీనజనులను కనికరించి కరుణ చూపమ్మా ||దీనుల||