Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: జూబిలీ స్వరం
ప. అమ్మా మరియమ్మా
మము బ్రోవగ రావమ్మా
ఏ పాపము జేసితిమో ..
మము కాపాడమ్మ
దీనుల మమ్మ దయగనవమ్మ
దేవమాత నీవే ||అ||
1. కామ, క్రోధ, లోభ,
మోహములకు ....దూరముగజేసి
సర్వేశ్వరునుకి సేవచేయగ
సాయపడగ రావే ||అ||
2. యేసు నాధునకు ప్రియతమ తల్లి
జయము దేవమాత
మమ్ము క్షమించగ జేసు నాధునకిల
మొరలిడవే మాతా ||అ||
3. దేవుని పదియాజ్ఞలను....
మీరకుండునటుల
మనో బలమును మాకు నొసగి
మము దీవింపగదమ్మా ||అ||
4. సర్వకాల సర్వావస్థలలో....
మమ్ముల కాపాడి
పితకును సుతునికి స్పిరితు సాంక్తునకు...
మహిమ కలుగు గాక ||అ||