Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. అమ్మా మరియా జగద్ పావని ||2||
కనురెప్పల్లే మమ్ము కాపాడమని ||2||
పసిపాపవలే మిమ్ము వేడేము తల్లి ||2||
మేరి మాత ఓ లూర్థుమాత ||2||
జగద్ మాత ఓ పుణ్య ప్రబోధ ||2||
1. మనసే సత్యం మమతే నిత్యం
పేదల పాలిట మలయ సమీరం
సేవా భావం మోక్షామార్గం
నీ పలుకే శుభసందేశం
ఆకలి తీర్చే తల్లివి నీవు
అపద్భాందవు నీవే నమ్మా
ప్రేమకు నీవే మారుపేరు
నీ మనసే ఓ కొల తీరు
2. అడిగే దూరం బ్రతుకు భారం
గమ్యం తెలియని బాటసారులం
నీ సేద నీడలో నిరాశ వేళలో
దారే చోద్యంనీ పేద దీనులం
వేకువ వాకిట తారక నీవు
ఆపద వేళలో ద్వీపం నీవు
చీకటిలోన సిరి వెన్నెలవై
మోక్షపు దారిన చూపవే తల్లి