Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
అమ్మా మరియా మా ప్రియ జననీ
కాపాడు పుడమిని మా జన్మభూమిని ||2||
శాంతిని వొసగ ప్రార్థించుమమ్మా
నీ ప్రియ సుతుని రాజాధి రాజుని ||2||
llఅమ్మాll
1 వ చరణం..
లేమిలొ కుమిలే అన్నార్తులను
ఆదుకో తల్లి నీ మాతృ ప్రేమలో ||2||
న్యాయము పొందగ వేడుము నాధుని
సమత మమత ఇలలో వెలయు ||2|| llఅమ్మాll
2 వ చరణం..
ఈతి బాధలు క్షామ వరదలు
రాకుండ ఎపుడు కాయము తల్లీ ||2||
పరిశుద్ధతలో మేమందరము
జీవించగను వరమీయు మమ్మా ||2|| llఅమ్మాll