Lyrics: Fr. Francis
Tune: unknown
Music: Christopher Babu
Album: అమృత స్వరము
ప. అమృత స్వరము నీ దివ్య వాక్యం
అవనికి వరము నీ ప్రేమ కావ్యం ||2||
అజరం అమరం నీ వాక్యం
మననం మధురం నీ కావ్యం ||3|| ||అ||
1. పరిమళమైన నీ ప్రేమకు
పరమొంది నే పాడనా ||2||
పావనమైన నీ చరితను
ప్రతిదినము స్వామి నే పొగడనా ||2|| ||అజ||
2 మహిమకు రూపం నీవేగా
మనసార స్వామి నిను వేడెద ||2||
మంచి మనస్సును మాకిచ్చి
దీవెనలు దేవా దయచేయుమా ||2|| ||అజ||