Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: unknown
అందమైన జీవితం దేవా నీ కానుక -
ఈ జీవన కుసుమం నా ప్రేమ కానుక
ఆదరంతో స్వీకరించు నా జీవిత కానుక
1. తీయనైన తేనెలొలికే మనసునిచ్చావు
పరిమళించు ప్రేమ కుసుమం మదిలో నాటావు
జీవితంలో ప్రేమనంతా నీకు అర్పింతు
నాదు హృదిలో శాశ్వతంగా నీవు జీవించు.
2. మరువలేనిది అమరమైనది స్నేహ సౌభాగ్యం
వెలుగునిచ్చే జీవజ్యోతి శాశ్వతానందం
బ్రతుకులోని సంతసాన్ని నీకు అర్పింతు –
నీదు కృపలో శాశ్వతంగా నేను జీవింతు