Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: unknown
ప. అంతులేని ప్రేమతో నన్ను కలిగించిన దేవా
ఏ మివ్వగలను నీ ప్రేమకు బదులుగా ||2||
చేకొనుమా చేరదీయుమా
నా జీవితమే నీ అర్పణగ ||2||
1. ఈలోక సంపదలేవి
నీకు ప్రియము కావని
నన్ను నేనుగానే నీ సన్నిధి చేర్చితివి ||2||
కనికరములే గాని బలులను కోరని దేవా
దయతో చేకొను నన్ను నీ కానుకగా ||2|| ||అ||
2. ఆబేలు అర్పణను ఆదరించిన దేవా
సుంకరి పరితాపమును
స్వీకరించిన ప్రభువా ||2||
నీ దీవెన కోరి నీ చెంత నిలచితిని
చేకొని మార్చుము నన్ను నీకు యోగ్యునిగా ||2|| ||అ||