Type Here to Get Search Results !

అందమైనది ఈ లోకం ( andhamainadhi e lokam Telugu Christian Song Lyrics | Christian Hymn Song Lyrics in Telugu )

Lyrics: Fr. Eruva Lourdhu 

Music/Tune: Duggirala 

Album: యేసులాలి - 2 


ప. అందమైనది ఈ లోకం 

మీ అనురాగానికి ప్రతిరూపం 

ఆది దేవ ఇది నీ నందనం

అందుకొనుమా హృది వందనం ||2|| 


1. గలగలపారే సెలయేరులలో

(నీ) పలుకుల మధురిమ విన్నాము ||2|| 

తీయని కోయిల గానములో 

(నీ) కమ్మని మాటలు విన్నాము ||2|| 

పురివిప్పిన నెమలి నాట్యంలో 

(నీ) కళావైభవం గాంచాము 

ఏడు రంగుల మబ్బుతుంపరలు

సృష్టి ప్రాభవం గాంచాము. 


2. విరబూసిన ఆమని పువ్వులలో 

(నీ) చిరునవ్వులనే చూసాము ||2|| 

వికసించిన ఆ మబ్బులలో 

(నీ) వరధారలనే చూసాము 

పున్నమి జాబిలి వెన్నెలలో 

నీ చల్లని మనస్సుని గాంచాము 

ఏడు రంగుల మబ్బుతుంపరలు 

సృష్టి ప్రాభవం గాంచాము. ||అ|| 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section