Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. అందుకో దైవతనయ
మేమర్పించు హృదయార్పణం
అందుకో ఫలపుష్పములు
దయతోడ స్వీకరించు ఈ కానుకల్ ||అ||
1. మాకున్న సర్వం - అర్పణగా చేసి
అర్పింతుమయ్య - బలిపీఠముపై ||2||
పరలోక వాసుల స్థిర (ని)వాసమందు.
పరిపూర్ణ ఫలములతో మము నింపుమా ||అ||
2. ద్రాక్షారసమందు జలబిందువోలె
నడిపించుమయ్యా నీ ప్రేమలో
పరిశుద్ధపరచుమా మనస్సులను
మము చేర్చుకోవా మా దేవా ||అ||