Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: unknown
ప. అందుకో దేవా మా అర్పణలు
దీవించుమోదేవా నీ బిడ్డలను ||2||
దీనహీనుల హృదయ కానుక ||2||
స్వీకరించి సేదదీర్చు
1. నింగినేల అంతా నీదే
ఏమి ఇవ్వగ సాహసింతును ||2||
కష్టఫలములు నీకు ఇచ్చెద
కరము చాచి గైకొను దేవా ||2||
2. రత్నరాసులు ఇవ్వజాలను
కోడెదూడలు ఇవ్వలేను . ||2||
మాదు శ్రమల కానుకిత్తుము
సంతసంబున చేకొను దేవా