Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: unknown
అందుకో సర్వేశ్వరా - అందుకో పేద అర్పణ
అప్ప ద్రాక్షరసములతో - తనువు మనసు జతచేసి
అర్పింతుము సర్వము ఈ దివ్య బలిలో
1. నీతియుక్తమైన సమాధానకరమైన అర్పణలే
నీకెంతో యిష్టమని వాక్యములో విన్నాము
శ్రమకోర్చి చెమటోడ్చి ఏరికోరి తెచ్చాము
స్వీకరింపవా అంగీకరింపవా ఆదరింపవా ఆశీర్వదించవా
2. నిష్కల్మషమైన క్షమా ప్రేమ పూర్వమగు హృదయములే
నీకెంతో ప్రీతియని శుభవార్తలో విన్నాము
క్షమియించి క్షమనడిగి సఖ్యతపడి వచ్చాము
స్వీకరింపవా అంగీకరింపవా ఆదరింపవా ఆశీర్వదింపవా