Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
అనురాగ దీపాలతో
అర్పింతు నా హృదయం
ఆత్మీయ వదనముతో
సమర్పింతు నా సర్వం
అప్పద్రాక్షరసములతో
నజరేయుని బలిదానం
అర్పింతు నీ కోవెలలో
తరియింతు నా ప్రభువా ||అనురాగ||
1. ఫలము-పత్రం - ధూపదీపం
స్వీకరించుమా
పూజ పుష్పం ధనము ధాన్యం
స్వీకరించుమా ||2||
ఆత్మ గీతం - మనసునిండా
ఆత్మకలశం పొంగిపొరలే ||2||
తరియింతు నీదు సేవలో
నా స్నేహ అర్పణగా ||2|| ||2||
2. పేదరాలి - దీన హృదయం-
ప్రేమ కానుక పూజాబలిలో -
తనువు మనసు - పేదకానుక ||2||
మౌనగీతం హృదయమంతా
గుండె గుడిలో ప్రేమ సిరులు||2||
పులకింతు నీదు సేవలో
నా ప్రేమ అర్పణగా ||2|| ||అనురాగ||