Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: unknown
ప. అందుకొను మా దేవా నాదు దీన కానుక ||2||
ప్రీతితోడ ఆదరించు
పేద కానుక.. పేద కానుక..
1. అప్పరసము తెచ్చినాను - స్వీకరించుమా
ఆదరముతో ఆదరించి వరములీయుమా ||2||
నిన్ను చేరగా ఓ స్వామి వేచి యుంటిని
చేరదీసి చెంత చేర్చి
ప్రేమనీయుమా ప్రేమనీయుమా
2. నా జీవిత సర్వంబు నీకే అంకితం
కరుణతోడ దీవించి దరికి చేర్చుమా ||2||
నిన్ను చూడగా ఓ స్వామి కోరి వచ్చితి
కరుణతోడ చేయిచాపి
మమ్ముకాయుమా మమ్ముకాయుమా ||అ||