Type Here to Get Search Results !

అందుకొనుమయా మా చిన్ని అర్పణ ( andhukonumaiah maa chinni arpana Telugu Christian Song Lyrics | Christian Hymn Song Lyrics in Telugu )

 Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


అందుకొనుమయా మా చిన్ని అర్పణ - 

ఆదరించుమా మా పేద అర్పణ 

ఈ బలిలో అర్పింతుము మా దీన అర్పణ 

గైకొనుమా దేవా ఈ ప్రేమ అర్పణ ||అందు|| 


1. ఆబేలుని కానుక మేలైన అర్పణ - 

అబ్రహాము కానుక విశ్వాస అర్పణ ||2|| 

మేమొసగే కానుక మా దీన హృదయమే - 2 

దయతో ఆదరించుమా ప్రేమతో స్వీకరించుమా ||అందు|| 


2. విధవరాలి కానుక సంపూర్ణ అర్పణ - 

సుంకరుని కానుక పరివర్తన జీవితం 

మేమిచ్చు కానుక ఈ భూమి ఫలములే 

దయతో ఆదరించుమా ప్రేమతో స్వీకరించుమా ||అందు|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section