ప. అనుదినము - అనుక్షణము
యేసుని వాక్యము వినుడీ
ప్రతిదినము - ప్రతి క్షణము
యేసుని బోధలు వినుడీ
మార్గమైన, సత్యమైన
జీవమిచ్చెడి యేసుని వాక్యం హల్లెలూయ
సరిగారి మా గపా మ దా ప ని.... సాగరిసా
1. జీవజలముతో- సమరయ స్త్రీని
దీవించిన ప్రభు వాక్యం
సుంకరి లేవిని - అనుసరించమని
పిలిచిన యేసుని వాక్యము
చిగురించునది - బ్రతికించునది
యేసుని సందేశం
సరిగారి మా గపా మ దా ప ని.... సాగరిసా
2.. కనులను తాకి - దృష్టిని ఒసగి
స్వస్థత నిచ్చిన వాక్యం
మనసులు తాకి బ్రతుకులు మార్చి
జ్ఞానము నిచ్చిన వాక్యము
వెలుగించునది - కరిగించునది
యేసుని సందేశం
సరిగారి మా గపా మ దా ప ని.... సాగరిసా