అపురూపమైన-నీ దివ్యవాక్యం
నా జీవితాన-మధురాతి మధురం ||2||
వినిపించు దేవా నీ జీవవాక్యం ||2||
నా ప్రాణమిలలో-ఫలియించగా ||2|| ||అపురూప||
1. మనసార నీ వాక్కు ధ్యానింతును
ఆనంద హృదయాన వినుతింతును ||2||
నీ వాక్యవెలుగులో నీ కాంతి బాటలో
ప్రియమార నడిచెద నీ సేవ చేసెద ||2||
నీ సేవ చేసెద ||అపురూప||
2. నీ ప్రేమ మార్గాన పయనింతును
కరుణాంతరంగాన ప్రార్ధింతును ||2||
నీ దివ్యప్రేమలో నీ జీవన బాటలో
ముదమార నడిచెద నీ స్తుతులను పాడెద ||2||
నీ స్తుతులను పాడెద ||అపురూప||