ఆహాహా హా....... అల్లెలూయా ||4||
అనురాగ దేవుడా - అపురూప దేవుడా
ఆరాధింతును-ఆలాపింతును
ఆత్మ స్వరూపుడా - నీ ఆత్మతో జీవింప
నా జన్మధన్యం ||అను||
1. నాలో నీరూపం పవిత్రం
నీలా జీవింప కృపతో నింపుమయ్యా ||2||
నా మనసును మందిరం చేయుమయ్యా ||2||
నీ కోసం జీవింప వరమీయవయ్యా
అల్లేలూయా - ఓనా క్రీస్తా ||4|| ||అను||
2. జీవాహారం నీవే క్రీస్తా
వెలుగు రక్షణ కర్తవు నీవేనయ్యా ||2||
నా గుండెను గుడిగా మార్చు దేవా ||2||
నా ప్రాణ క్రీస్తా - ఆశీర్వదించుమయ్యా
అల్లెలూయా - ఓనా క్రీస్తా ||4|| ||అను||