Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: ఆలయగీతం
ప. అనురాగ విందు - అప్పరూప విందు
మన ఆత్మలో - జీవాత్మను
పరిపూర్తిగా నింపేటి విందు
1. విశ్వ శాంతికై - సాధనలో
యజ్ఞ ఫలం మన ఈ విందు ||2||
నవ్య జీవన స్థాపనలో ||2||
దివ్య ఫలం ప్రేమ ఫలం
ఈ విందు ఆనంద విందు
2. అమర ప్రేమ సుధ కానుకగా
త్యాగఫలం మన ఈ విందు
కరుణ జాలికల కలయికలో
సిలువ ఫలం ప్రేమ ఫలం
ఈ విందు ఆనంద విందు ||2||
3. హరిత భరితమగు ఆత్మలకు
మోక్ష పదం మన ఈ విందు
నమ్మి యున్న ఈ దీనులకు
జీవ బలం ఆత్మ ఫలం
ఈ విందు ఆనంద విందు ||అ||