Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప అనురాగపు ఈ భోజనం
అనుదిన బలిభోజనం
ఆత్మాంధకారమును అణచి వేయును
ఈ భోజనం ప్రభుభోజనం ||అ||
1. గోధుమ రొట్టెను అందుకొని
ద్రాక్షారసమును తీసికొని ||2||
ఇది నా దేహము గైకొనుడి
ఇది నా రుధిరము త్రాగుడని ||2||
నుడివెను మన ప్రభు కడరాత్రి ||2|| ||అ||
2. శిష్యుల పాదములను కడిగి.
మాతృకనెంతయో మనకొసగి ||2||
ప్రేమను పంచుచు ప్రభు యేసు
పరులకు ప్రేమను చూపుడని
నుడివెను మన ప్రభు కడరాత్రి ||2|| ||అ||
3. శిష్యుల హృదయాలు ప్రభు తెరచి
దండిగ వరములు కురిపించి ||2||
అభిషేకంబును పొందుడని
నా జ్ఞాపకంబుగ నుండుడని ||2||
నుడివెను మన ప్రభు కడరాత్రి ||2||