Lyrics: Fr. Dusi Devaraj
Tune: Fr. D.V. Prasad
Music: Dattatreya
Album: జీవశృతి - 3
అనురాగమే కురిపించిన
ఆనందమే అందించిన
ఆకాంక్ష నే రగిలించిన
అపురూపమౌ ప్రభు యేసుని
లోకొందము లోకొందము
1 వ చరణం..
ఆ ప్రియ వదనం.... అమృత కలశం
వెన్నెల వంటి.... చల్లని మనసు
పంచిన స్నేహం... మధురాతి మధురం
అనురాగ సుధలను.... చిలికించును llఅనురాగమే ll
2వ చరణం..
ఆ ప్రభు నయనం... కరుణకు నిలయం
పాపుల యదలో... ఉజ్వల దీపం
ఆయన భాష్యం.... సాగర కెరటం
ఆనంద తీరాలు.... దరి చేర్చును llఅనురాగమే ll
3వ చరణం..
యేసుని వినయం... మనకిల శరణం
పంచిన బ్రతుకే... జీవన మార్గం
మనసును కలిపి.... ప్రేమను పంచి
ఆరాధ్య మూర్తిని... సేవింతుము llఅనురాగమే ll