Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప|| అపురూపమైన నీ ప్రేమలోన
ఆరాధ్యమైన నీ గుండెలోన
ఒక్కింత నేను తలదాచుకొనీ
నా చిన్ని ప్రేమను అర్పించుకోనీ
||అపురూపమైన||
1. కనుపాపవెనుక నే కన్నకలలు
నా ఊహలోని నా ఆశలెన్నో
నయనాల నిండా నీ దివ్యరూపం
పిలిచేను నిన్ను నా చిన్ని హృదయం
నీలోని ప్రేమే నాకున్న అభయం
అర్పింతు దేవా నా జీవితం
||అపురూపమైన||
2. కొనలేని విలువ నీ ప్రేమే కాదా
ధరియింతు నిన్ను నా జీవితాన
ఈ అప్పద్రాక్ష రస రమ్యరూపం
కనువిందు చేసెను ఈ దివ్యబలిలో
నా ప్రేమ గురుతుగా అర్పింతుదేవా
నాకున్న సకలం నా జీవితం
||అపురూపమైన||