Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
అర్పింతునయ్యా ఈ పేద బ్రతుకు
సమర్పింతునయ్యా నా సర్వములు
దయగల దేవా గైకొనరావా
పవిత్ర పరచుము ఈ అర్పణలన్
1 ఆబేలు అర్పణ ఆదరించి -
పేదరాలి కానుక ఘనమనీ
గైకొను దేవా ఈ నా జీవితం -
అపురూపమైన నా కానుకగా
2. అన్నా అర్పణ స్వీకరించి -
క్రీస్తును మాకు బలిగా ఒసగిన
నను నేను బలిగా అర్పించెద -
చేకొని నన్ను దీవించు దేవా