Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
అర్పింతునయ్యా నా సర్వమును -
ఈ దివ్య పూజలో మనసారా
స్వీకరించుమయ్యా నా అర్పణను -
నీ ప్రేమ కరముతో ముదమార
అది సంభూతుడా ఏమివ్వగలను
నీకు నాకున్నదంతయు నీదే ప్రభూ ||ఆది||
1. అప్ప ద్రాక్ష రసములను అర్పింతును -
నా ప్రథమ ఫలములను సమర్పింతును
ధూపదీప నైవేద్యము అర్పింతును -
తగ్గింపు మనస్సును సమర్పింతును ||ఆది||
2. పేదరాలి కానుకవలె అర్పింతును -
ఆబేలుని అర్పణవలె సమర్పింతును
మెల్కిసెదేకు కానుకవలె అర్పింతును-
బంగారు సాంబ్రాణి సమర్పింతును ||ఆది||