Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
అర్పణ హృదయార్పణ అర్పణ ప్రేమార్పణ
అలంకరించితిని స్వామి ఈ మందిరమును
నువ్వు వస్తావని నీకై నవ సుమములు పరిచితిని
హారతులను చేకొని ద్వారము కడ నిలిచితిని
నీ తలపుల ఊసులతో నీ కోసం నిలిచితిని
1. ఒక క్షణమైన చాలు నీ సన్నిధిలో నేనుండిన
ఒక మాటైనా చాలు ప్రేమగా నన్ను పిలిచిన ||2||
కరుణతోడ ఒక్కసారి నన్ను చూడుమో స్వామి - ||2||
నీ కన్నులలో పాపగా కలకాలం నిలిచిపోని
2. ఎన్నెన్నో ఊసులు నీకు నేను చెప్పాలని -
నా ఎదనే ఓ పానుపుగా సిద్ధము చేశాను స్వామి
ప్రేమతోడ ఒక్కసారి నన్ను చేరుమో స్వామి -
నీ చేతులలో జ్యోతిగ చిరకాలం వెలిగిపోనీ