Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
పల్లవి:
అర్పణలివిగో.... దేవా.... సమర్పణలివిగో తండ్రీ||2||
అందుకొనుమా మాదు అర్పణ... స్వీకరించుమా... మా సమర్పణ||2||
మా అర్పణ – మా సమర్పణ ||అర్పణ ||
1 వ చరణం..
ఆబేలుని అర్పణలాస్వీకరించుమా ||2||
అబ్రహాము అర్పణలా ఆదరించుమా ||2||
ఇదిగో ప్రభు మా హృదయార్పణ...
ఇదిగో ప్రభు మా ప్రేమార్పణ ||2||
కరుణతో స్వీకరించుమా ||2|| ||అర్పణ ||
2 వ చరణం..
పేదవారి ప్రధమ కానుక – స్వీకరించుమా
పాపాత్ముల పవిత్ర (ప్రధమ) కానుకలు చేకొనుమా
ఇవిగో ప్రభు మా హృదయార్పణ
ఇదిగో ప్రభు మా ప్రేమార్పణ ||2||
మా కున్న సర్వం నీకంకితమివ్వ ||2||
ఆదరించి... స్వీకరించుమా ||2|| ||అర్పణ ||