Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
అర్పణలివ్వగ సంతసాన మేము నిలిచితిమయ్యా
సుగంధాలు వీచే మా హృత్కమలాలు సమర్పింతుమయ్యా
1 వ చరణం..
అన్నార్తుల మేము కరుణించుమమ్ము
కన్నతల్లివోలే దయచూడు దేవా
నీ పాదాల చెంత అర్పించినవన్నీ
సంప్రీతితో గైకొని దీవించుమా
2 వ చరణం..
కన్నులారా నిన్ను దర్శించి మేము
విన్నపాలుచేయ నీ మ్రోల చేరితి
మిన్నయైన ప్రేమ మేమెపుడు నోర్చ
మేమందించు కానుకలందుకొనుమా