Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: unknown
అర్పించనా ప్రభు అర్పించనా
అంజలి ఘటియించి అర్పించనా ||2||
1. చెమ్మగిల్లు కన్నుల నుండి
జలజల రాలే బాష్పాలను ||2||
దాసుడ నేను దోసిట పట్టి
భక్తితో నీకు అర్పించనా ||అ||
2. దీన ధ్యానాలోచననుండి
తొణికిసలాడే లాస్యాలను ||2||
మోదముగా నీ ఆమోదముకై
ప్రణమిల్ల నీకు అర్పించనా ||అ||
3. ఉల్లమొందు హృదయము నుండి
వడిగా ఉరికె సుతులను నేడు ||2||
కరములు మోడ్చి శిరమును వంచి
ప్రేమగా నీకు అర్పించనా ||అ||