Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: unknown
ప. అర్పణ ఇదిగో ఓ అమరుడ యేనా
తెచ్చామయ్యా మా అర్పిత హృదయం
గైకొను దేవా చిరు చిన్ని కానుక
ఉన్నది అంతా నీ వరదానమే కాదా ||2|| ||అర్ప||
1. నేనివ్వలేను దావీదు ధనము
అసలే లేదుగ సాల్మోను సంపద ||2||
ఉన్నవి రెండే కాసులు
మిగులున్నది పేద హృదయము ||2||
అర్పించ సమర్పించ-చేరాను నీ బలిపీఠం ||2|| ||అర్ప||
2 అర్పించలేను ఆబేలు అర్పణ .
అసలే లేదుగ అబ్రహము త్యాగబలి ||2||
ఉన్నవి రెండే కాసులు
మిగిలున్నది పేద హృదయం ||2||
అర్పించ సమర్పించ-చేరాను నీ బలిపీఠం||2|| ||అర్ప||