Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
అర్పణా ఇది ప్రేమ అర్పణ -
అర్పణా ఇది భక్తి అర్పణ
అందుకొనుము స్వామి ప్రేమతో
అనురాగ భరితమైన మా అర్పణ
1. గొప్పవైన కానుకలు మెప్పు నొందలేవని -
నీతిగల కానుకలు గోరంతలు చాలని
మా శక్తి మేరకు మా తృప్తి మేరకు -
అర్పించే అర్పణ కాదనకు స్వామి
2. కలుషమైన హృదయాలు అర్పణకు నోచవని
ద్వేష భావ చర్యలు నీ ప్రేమను పొందవని
శతృత్వం మరచి మితృత్వం వలచి
మీ చెంతకు తెచ్చాము మా మనసులు