Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
అర్పించెదను సమర్పించెదను
నాకున్నదంతయు నీదేనుగా
నీ కృప నాకు చాలయ్యా -
వేరేమి నాకు వలదయ్యా
1. ధన ధాన్యములు అడుగవు నీవు
మణి మాణిక్యముల్ కోరవు నీవు
నా దీన హృదయం నీ కర్పింతును -
మన్నించి నన్ను గైకొనరావా
2. బలము కులము అడగవు నన్ను -
అందము చందము ఆశించవయ్యా
విరిగి నలిగిన హృది నర్పింతును -
స్వీకరించి నన్ను ఆదరించు దేవా