Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
అర్పితం ప్రభువా అర్పితం -
అంకితం ప్రభువా నాదు జీవితం
నీవొసగిన వానినే నీ కొరకే అంకితం
ఇదియే ఈ పేదవాని హృదయ అర్పణం
మార్చుము దేవా మంచి సాక్షిగా -
నీకు ప్రీతిగా ఈ పూజలో
1. బంగారమును వెండికన్నను -
మేలిమైన నా మనసే నీకు
అర్పించగను నిలిచియుంటిని -
ఆదరముతో నీవు అంగీకరించి
మార్చుము దేవా మంచి సాక్షిగా -
నీకు ప్రీతిగా ఈ పూజలో
మపపని మపసని పనిపమ పమరి
మపపని మపసని పనిసని సరిసా
2. మారు మనసును క్షమా గుణమును -
సోదర ప్రేమ నే కలిగియుంటిని
నీకు ప్రియముగా (నన్ను) మలచుకొంటిని -
గురు కరములతో ఆశీర్వదించి
మార్చుము దేవా మంచి సాక్షిగా -
నీకు ప్రీతిగా ఈ పూజలో