Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: unknown
ప. అర్పింతుమయ్యా మా కానుకలూ ||2||
మన్నించుమయ్యా మా మనవులనూ ||2||
ఆత్మీయ కానుక అందుకొనుమయా ||2||
అనురాగ మాలనై అర్పింతునూ ||2|| ||అ||
1. నీ పాద సన్నిధిలో ఓ పూవునై
నిలచుంటినో స్వామి నీ సేవకే ||2||
దయతోడా నినువీడా నీ అక్కునా ||2||
నీ సేవలోనే నే కరిగిపోతా ||అ||
2. గోరంత పూజ మన్నించుమా ||2||
ఈ పేద కానుక ఆదరించుమా ||2||
మా జీవితాలన్ని హారతి చేసి ||2||
అర్పింతుమో స్వామి మీ మందిరాన ||2|| ||అ||