పల్లవి : ఆరాధనా అందుకో ఆరాధనా అందుకో
పాపక్షమాపణ జీవమునిచ్చిన కరుణామయా అందుకో (2)
1. అబ్రహాము ఇస్సాకు యాకోబు దేవా
మోషేతో అన్నావు ఉన్నావని (2)
అల్పము నీవే ఓమేగయును (2)
ఆధ్యంతరహితుండ నీవేయనుచు.
ఘనత మహిమ నీకేనని
అల్లెలూయ గానము చేసెదను.
కరుణామయా అందుకో... ॥ఆరాధన॥
2 తెలిసికొంటిని నేను నాయేసు నిన్ను
సర్వశక్తిగల ప్రభువని (2)
రానున్నావు మరల నాకై (2)
ఆనంద దేశములో నన్నుంచుటకై
ఘనత మహిమ నీకేనని
అల్లెలూయ గానము చేసెదను కరుణామయా అందుకో...॥ఆరాధన॥