అల్లేలూయ క్రీస్తునకే
రాజాధిరాజు ఇమ్మానుయేలు
మనతో ఉన్నావాడు
ఆరాధనా, ఆరాధనా
అల్లేలూయ, అల్లేలూయ, అల్లేలూయ, ఆమెన్
పరంజ్యోతి, నా త్రోవకు వెలుగు నీవే
చీకటి నన్ను అలముకున్న
పడిపోను నీవుండగా
ఆరాధనా.... అల్లేలూయ.....
జీవజలమా నా దాహం తీర్చువాడా
పాపశాపములో ఎండిన వేళ
వర్షమై నాలో ప్రవహించుమా
ఆరాధనా.... అల్లేలూయ.....