పల్లవి : సత్యసంపన్నుడా - సర్వాధికారి (2)
సర్వలోకాల నేలేటి రాజా (2)
స్తుతియు మహిమ ఘనత నీకే (2)
ఆరాధన.. నీకే ఆరాధన (2)
పాదస గమ రీగమ గరిస పాదసగపమ రిగమరిస
కృప వాత్సల్యము గల దేవా
నా నీతికాధారమగు ప్రభువా
జయమని పాడెదను నా ప్రాణమర్పింతును (2) ||ఆరాధన||
దీర్ఘశాంతము గల ఓ దేవా
నీకు సాటి లేరెవ్వరు
మహిమలో చేరెదను నీతోనే జీవింతును (2)
నిత్యము నీతోనే జీవింతును ||ఆరాధన||