పల్లవి : రండి ఆరాధించెదం దేవాది దేవుని
రండి కీర్తించెదం - రాజాధి రాజుని
చేతులని పైకిలేపి - శిరమును వంచి
స్తుతించి పొగడెదం - క్రీస్తు నాధుని
అల్లేలూయ.... అల్లేలూయ (2)
వ్యాధులన్ బాధలన్ జయించుటకు
ప్రభువును స్తుతించెదము
బంధనములను ఛేదింప
ప్రభువును పొగడెదము..... అల్లెలూయ .... ॥ రండి ॥
ఎరికో గోడలు కూలద్రోయ
ప్రభువును స్తుతించెదము
ఎర్రసముద్రము చాటుటకు
ప్రభువును పొగడెదము..... అల్లెలూయా ..... ॥ రండి ॥