Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
కలసి మెలసి తరలిరండి ఇదే మనకు శుభకరమని
కరములెత్తి పాడుదాం - ఏసుక్రీస్తు నాధునకు స్వాగతం అని
పితయైన సర్వేశ్వరుని ఏకైక తనయుడని
మాదమ దమ దానిద నిద సా మగస సస దనిస
లోక రక్షణార్ధమై దేవుడిచ్చిన వరమని
ఇదే పర్వదినమని హాయి హాయని హాయి హాయని
1. సలోమోనుని జ్ఞానముతో - దీవించిన ప్రభుని
మోషేను నాయకునిగ నడిపించిన దేవుని
పూజించుదాం స్తుతియించుదాం కీర్తించుదాం
ఆత్మ దేవుడే దిగిరావాలని మన కాపరులను దీవించాలని
మన తిరుసభను ఆవరించాలని -
రమ్మని కమ్మని వరములిమ్మని
కలిసి పాడుదాం హాయి హాయని
2. ధర్మం న్యాయం శాంతం సౌఖ్యం యేసు పరిపాలనం..
సహనం త్యాగం వినయం క్షమాపణం క్రీస్తు ప్రేమ ప్రబోధం
జాతివర్ణ వర్గ విభేదంబులేని పాలనం
దావీదు వంశపు ఇమ్మానుయేలు ఆలనం
మన మంచికాపరులకు మార్గదర్శకం -
నిత్య ప్రకాశం పరమ పావనం ||2|| '
3. ఇతడే నేను ఎన్నుకొన్నవాడు -
నా ప్రియమైన తనయుడూ
ఇతనిని ఆలకించి అనుసరించండి
ఇదే ఇదే దివితో భువిలో వినిపించువాణి
ప్రతి గుండెలో ప్రతిధ్వనించు మృదుమంజుల
సంగీతవాణి ఈ స్వరం ఆలకించి
జీవించు వాని జీవితం ధన్యమేననీ
కలసి పాడుదాం హాయి హాయనీ హాయి హాయనీ ||కల||