Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
సాకి: భారముతో అలసిసొలసియున్న సమస్త జనులారా
నాయొద్దకు రండి మీకు విశ్రాంతి నిచ్చెద
గమపని సగరీ నీదామగారి నీనిస గమ నీస నినిస
ప: కలువరి బలి పూజలో పాల్గొనరారండి ఓజనులారా
మహెూన్నతుడు ప్రభు మహా దేవుడు
మన రక్షకుడై వేచియున్నాడు
తరలి రండి కదలి రండి వరములు పొందగ వేగమె రండి
గమపనిస సగరీసనిప గమపనిస సగరిమగరి సనిప
పనినినిని సానిసరి రిగరిమగరి సనిసా సనిపమ గమప
1. కలత చెందకు కలవర పడకు క్రైస్తవ సంఘమా
ప్రభువు రెక్కల మాటున మనకు భయమేలేదుగా ||2||
సింగమే దాడిచేసినా సర్పమే కాటువేసినా ||2||
కీడు జరుగదు హాని కలుగదు శ్రీసభ శిష్యులకు ||2||
తరలి రండి కదలి రండి వరములు పొందగ వేగమె రండి ||2||
2. విరిగి నలిగిన క్రీస్తు దేహమే జీవాహారమని
ప్రభువు రక్తమే పాప కర్ములకు అమృతపానమని
నిండు మనస్సుతో నమ్మండి-నిత్య జీవమే పొందండి
నాటి సిలువ బలి నేటి దివ్య బలి పాల్గొనరారండి
తరలి రండి కదలి రండి వరములు -పొందగ వేగమె రండి