పల్లవి : అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా
అత్యంత ప్రేమ స్వరూపినీవే - ఆరాధింతుమునిన్నే
అహహ.. అల్లెలూయ (3) అహహ.. ఆమెన్
1. ఆశ్చర్యకరుడా స్తోత్రం - ఆలోచనకర్త స్తోత్రం
బలమైనదేవా నిత్యుడగు తండ్రి - సమాధానకర్త స్తోత్రం
2. కృపాసత్యసంపూర్ణుడ స్తోత్రం కృపతో రక్షించితివి స్తోత్రం
నీ రక్తమిచ్చి విమోచించినావు నా రక్షణకర్త స్తోత్రం
3. స్తుతులపై ఆసీనుడా స్తోత్రం - సంపూర్ణుడా నీకే స్తోత్రం
మా ప్రార్ధనలు ఆలించువాడా మా ప్రధాన యాజకుడా స్తోత్రం