Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
చల్లనైన స్వామిమాట - సామవేద గీతిబాట
ఆలించరా ఆ... ఆ... ఆ ఆలపించరా
అల్లెలూయ - అల్లెలూయ||2||
1. ఇంటింటికి వెలుగిడు సునాదము -
ప్రతి మనిషికి మదినిడు సువేదము
బీటబారిన మనుజుల మదిలో -
తేనెజల్లు కురిపించు వాక్యము
2. ఎందెందున వినబడు ప్రబోధము -
అందందున కనబడు ప్రమాదము
త్రోవతప్పిన బాటసారికి -
త్రోవచూపును దీపకాంతియై