Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
చిగురించె నీ దివ్య స్నేహం
నా గుండె తాకింది దేవా ||2||
పులకించె తనువు-మురిపాల మనసు ||2||
నీ దివ్య హస్తాల అర్పింతును ||2|| ||చిగు||
1. నా పేరు పిలిచి - నను చేరదీసి
ఎదలోన నిలిపావు దేవా ||2||
ప్రతిరోజు నన్ను దీవించినావు
నీ చేతిపై నన్ను వ్రాసావు నీవు ||2||
వాత్సల్య నిలయా - నా యేసురాజా ||2||
నీ దివ్య హస్తాల అర్పింతును ||2|| ||చిగు||
2. ఈ రొట్టె రసము - నీ దివ్య వరము
మనుజాళి శ్రమ రూపం దేవా ||2||
ప్రియమార గైకొను ఈ భూమి ఫలము
ఇలలోన నీ ప్రేమ సంకేతమై ||2||
ఓ జీవదాతా - నా యేసురాజా ||2||
నీ దివ్య హస్తాల అర్పింతును ||2|| ||చిగు||