Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: నా ప్రాణనాథుడా
ప. చప్పట్లు కొట్టుచు చాటెదం
ఏసు స్వామి పుట్టినాడని
గజ్జెలతో గంతులేసి ఆడెదం
ఏసు సామి పుట్టినాడని ||2||
ఊరూర ఉరకలేసి ఆడెదం పాడేదం
మనసంత పొంగిపొరలి పాటలే పాడెదం ||2|| ||చ||
1. చలిచలిగా ఉన్న ఓ చల్లని రాత్రి వేళ
ఏసు సామి పుట్టినాడని
బెత్లెహేములోన ఓ పశువుల పాకలోన
ఏసు సామి పుట్టినాడని ||2||
గొల్లలంత వచ్చిచేరి గంతులేసి ఆడిరీ ||2||
దేవదూతలంత వచ్చి గానములే పాడిరి ||2|| ||చ||
2. ఆకాశాన ఉన్న ఆ తోకచుక్క తెలిపే
ఏసుసామి పుట్టినాడని
కలవరము చెందే ఆ హేరోదు రాజు
ఏసు సామి పుట్టినాడని ||2||
తూర్పు దిక్కున నుండి జ్ఞానులే వచ్చిరి ||2||
పరిమళ ద్రవ్యములు పోసి ఆరాధన చేసిరి ||2|| ||చ||
3. దావీదు వంశమున మరియ యేసేపులకు
ఏసు సామి పుట్టినాడని
ఈ నాడే మనకొరకై మన గ్రామమందు
ఏసు సామి పుట్టినాడని
ముసి ముసి నవ్వులు నవ్వే
ఆ బాలుని చూడుడి ||2||
బోసి నవ్వులతో ఇచ్చే దీవెనలే పొందుడి ||2|| ||చ||