Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప: చూచుచున్న దేవుడవయ్యా,
నన్ను చూచినావు
నీ పేరు ఏమిటో ఎరుగనయ్యా
నా పేరుతో నన్ను పిలిచావయ్యా
1. శారాయి మాటలే విన్నాను
అబ్రాహాము భార్యనైపోయాను
ఈ అరణ్యదారిలో
ఒంటరినై దిక్కులేక
తిరుగుచున్న హాగరును
నేను హగరును ||చూ||
2. ఇస్మాయేలుకు తల్లినైతిని
అయిన వారితో
త్రోసివేయబడితిని-కన్నకొడుకు
మరణమును చూడలేక
తల్లడిల్లిపోతున్న తల్లినినేను
అనాధతల్లిని నేను ||చూ||
3. పసివాడి మొరను
ఆలకించావు జీవజలము
నిచ్చిబ్రతికించావు నీ సంతతి వారిని
దీవింతునని వాగ్దానమిచ్చిన
దేవుడవు గొప్పదేవుడవు||చూ||