Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. చేకొను స్వామి మా సమర్పణ
దయగొను నాధా ఈ చిన్ని అర్పణ ||2||
దీన బాంధవ దయగల దేవా
స్వీకరించు దయతో మా దేవా ||చే||
1. పేదరాలి రెండు కాసులు ప్రియమాయె
నీకు ప్రియమాయె నీకు
ఆ ప్రేమ యోచింపక ఓ దేవా
వరమాయె నాకు వరమాయె నాకు
నీ చెంత చేరాను సన్నిధి కోరాను ||2||
కరుణించుమయా...
కరుణించుమయా..
2. మగ్దలేన పరిమళ తైలం ప్రియమాయే
నీకు ప్రియమాయే నీకు
విలువైన ఆ కానుక ఓ దేవా
కరుణించరావా కరుణించరావా
నా కున్న సర్వం సమర్పించినాను ||2||
స్వీకరించుము దేవా నా ప్రేమ నాధా||2|| ||చే||