Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
1 వ చరణం..
చెప్పలేదని పలుక బోకుడి,
జనులారా యేసుని చేరి మ్రొక్కి సేవ చేయుడి
ఎద్దు వలె తిని మొద్దు చందము
రద్ది లేకను నిద్ర చేయుచు,
రచ్చ తో మీ యిచ్చ చొప్పున
రాజ ఠీవి ని తిరుగుచున్నారు llచెప్పll
2 వ చరణం..
ముద్దు మురిపెము పెంచెదవు,
ఈ పాడు దేహము పట్టి నిప్పుల పాలు చేసెదవు వద్దురా ఇక
మొద్దు జీవుడ సద్దు చేయక హద్దు మీరగ తప్పి తిరిగితి
దైవ మాయని తప్పుననుమతి - నెంచు వేడు రా llచెప్పll
3వ చరణం..
మాయలోకము నమ్మి తిరగకుడి- మహిలోన దేవుని
మహిమ తెలియక మ్రగ్గి పోకుడి చూడరా దొరయ్య
దినమున సూటి దప్పిన పాపి జనులను ఘోర నరక
మందు ఆర్భటింప చేతురపుడు llచెప్పll
4 వ చరణం..
మూఢుడా ఈ మురికి డొక్కకురా ముప్పది
ఘడియలు మూల మెరుగని పాటు బడెదవురా,
సర్వ దేవుని వాక్కు గడియ సేపు ధ్యానము చేయ దీరదు
స్వామి అనుమతి వచ్చినప్పుడు
సాకు లేమి చెప్పెదవు రా llచెప్పll