Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. చూతమా మాతను చూతమా
స్నేహితులారా చూతమా
1. చూతమా తన కొడుకు బాధల
సొక్కిపోవుట గాంచి భువన
ఖ్యాతుడీ గతియాయెనని తన
కంట నీరొలికించు మరియను ||చూ||
2. మోదమగు పూదోట దుఃఖము
పాదుకొని చిత్తమున రక్త
స్వేద మొలికెడు సుతుని గని
నిర్మోదియై దుఃఖంచు మరియను ||చూ||
3. రాతి స్తంభమునను జూదులు
చేతుల విరగ గట్టి కొట్టిన
మాత విడువక యుండి అల
నిర్భీతు సుతునిగని
వగచు మరియను ||చూ||
4. ఆకటకంటకు మకుటమున తల
నదుమ వగచెడు సుతుని గనితా
వికల మానసికంబు తోడను
వెచ్చ నూర్చెడు మరియాంబను ||చూ||
5. కొడుకు స్లీవను భుజమున్ బెట్టియు
కొండ కేగడి బాధలన్నియు
దడయకను వీక్షించు వగపున
తల్లడిల్లెడు దేవమాతను ||చూ||
6. తన సుతుడు కపాల పర్వత
మునను నాటిన స్లీవ మ్రానున
బాధ చెందుచు మరణమొందిన
మహిని గని దుఃఖించు మరియను ||చూ||